Weight Lose: ఈ ఆహారాలు బరువు తగ్గాలనుకునేవారికి వరం..! తక్కువ కేలరీలు, మెరుగైన పోషకాలతో..

|

Jul 25, 2023 | 9:57 AM

Weight Lose Tips: బరువు తగ్గేందుకు నిరంతర వ్యాయామం ఎంత అవసరమో.. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే తినే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఈ క్రమంలో కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో తప్పక..

Weight Lose: ఈ ఆహారాలు బరువు తగ్గాలనుకునేవారికి వరం..! తక్కువ కేలరీలు, మెరుగైన పోషకాలతో..
Weight Lose Tips
Follow us on

Weight Lose Tips: బరువు తగ్గేందుకు నిరంతర వ్యాయామం ఎంత అవసరమో.. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే తినే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఈ క్రమంలో కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో తప్పక కలుపుకోవాలి. ఆ ఆహారాల్లో కేలరీలు తక్కువగా, పోషకాలు సమృద్ధిగా ఉన్నందున అవి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉపయోగపడతాయి. అలాగే శరీర పనితీరును మెరుగుపరుస్తాయి. మరి ఇందుకోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆకుకూరలు: బచ్చలికూర, కాలే, తోటకూర వంటి ఆకు కూరల్లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు A, C వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా వీటిల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడంలో ఇవి మెరుగ్గా ఉపయోగపడతాయి.

తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, వోట్స్ వంటి హోల్ గ్రెయిన్ ఫుడ్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల మంచి వనరులు. ఇవే కాక వీటిల్లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే తృణధాన్యాలు బరువు తగ్గడానికి మంచి ఎంపికగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

గుడ్లు: ప్రొటీన్ రిచ్ ఫుడ్‌గా పేరున్న గుడ్లు కూడా బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. ఇందులో శరీరానికి అవసరమైన అమైనో అమ్లాలు, విటమిన్ బీ వంటి పలు పోషకాలు పుష్కలంగా.. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు గుడ్లను నిశ్చింతగా తీసుకోవచ్చు.

సిట్రస్ ఫ్రూట్: నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రిఫ్రెష్ ఎనర్జీ బూస్ట్‌ని అందించడంతో పాటు శరీర ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. ఇంకా ఇందులోని ఫైబర్ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. సిట్రస్ పండ్లలో కేలరీల పరిమాణం చాలా తక్కువ.

డ్రై నట్స్: బాదం, వాల్నట్స్, చియా, అవిసె గింజలు వంటి డ్రై నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా.. పరిమితమైన కేలరీలు ఉంటాయి. ఈ కారణంగానే బరువు తగ్గాలనుకునేవారు డ్రై నట్స్‌ని తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..