Lifestyle: స్మోకింగ్‌తో ఆ సమస్య కూడా.. హెచ్చరిస్తోన్న పరిశోధకులు..

|

Feb 28, 2024 | 5:14 PM

అయితే స్మోకింగ్‌ వల్ల గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వెంటాడుతాయని తెలిసిందే. అయితే తాజాగా స్మోకింగ్ కారణంగా మరో సమస్య సైతం తప్పదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి...

Lifestyle: స్మోకింగ్‌తో ఆ సమస్య కూడా.. హెచ్చరిస్తోన్న పరిశోధకులు..
Smoking
Follow us on

స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్‌ కారణమని తెలిసినా కొందరు మానడానికి ఇష్టపడరు. ప్రభుత్వాలు సైతం ధూమపానం వల్ల కలగే నష్టాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నా ఈ చెడు అలవాటును మానడానికి ఇష్టపడరు.

అయితే స్మోకింగ్‌ వల్ల గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వెంటాడుతాయని తెలిసిందే. అయితే తాజాగా స్మోకింగ్ కారణంగా మరో సమస్య సైతం తప్పదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. స్మోకింగ్‌ వల్ల కంటి ఆరోగ్యంపైనా కూడా ఎఫెక్ట్‌ చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ధూమపానంకు, దృష్టి లోపానికి మధ్య ఉన్న సంబంధంపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

స్మోకింగ్‌, దృష్టి లోపానికి మధ్య ఉన్న సంబంధం ఆందోళన కలిగించే విషయమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే కేవలం స్మాకింగ్ చేసే వారికి మాత్రమే కాకుండా.. పొగ పీల్చే వారిపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో కంటి శుక్లాలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. దీని కారణంగా కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం, అస్పష్టమైన దృష్టి , ఒక వస్తువు రెండుగా కన్పించడం, కంటిలో తెల్లగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు.

అలాగే.. రాత్రిపూటవస్తువులు సరిగా కనిపించక పోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా దీని ప్రభావం, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్‌ ఎక్కువ ఉంటుందంటున్నారు నిపుణులు. వీరు స్మోక్‌కు గురైతే, డ్రై ఐ సిండ్రోమ్‌, ఆప్టిక్ నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..