Lifestyle: మాట్లాడే విధానం ద్వారా మీ వ్యాధి ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా.?

|

Sep 07, 2024 | 7:45 PM

ఒక వ్యక్తి స్వరం నెమ్మదిగా ఉంటే. అతను పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవాలి. పార్కిన్సన్స్ అనేది వయస్సు సంబంధిత వ్యాధి. మెదడులోని ఒక భాగం దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని ప్రొఫెసర్ యేల్ బెన్సౌసన్ చెప్పుకొచ్చారు...

Lifestyle: మాట్లాడే విధానం ద్వారా మీ వ్యాధి ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా.?
Voice
Follow us on

సాధారణంగా ఏదైనా వ్యాధిని గుర్తించాలంటే సంబంధిత పరీక్షలు చేయాల్సిందే. అయితే కేవలం మనం మాట్లాడే విధానం ఆధారంగా మనం ఎలాంటి వ్యాధితో ఇబ్బందిపడుతున్నామో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గొంతు ద్వారా వ్యాధులను పసిగట్టే విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన హెల్త్ వాయిస్ సెంటర్ కొంతకాలం క్రితం ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా సుమారు 30,000 రకాల వాయిస్‌ల డేటాబేస్‌ను పరిశీలించింది. ఏ రకమైన శబ్ధం ఎలాంటి వ్యాధికి సంకేతమే తెలుసుకునే విధానాన్ని రూపొందించారు.

ఒక వ్యక్తి స్వరం నెమ్మదిగా ఉంటే. అతను పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవాలి. పార్కిన్సన్స్ అనేది వయస్సు సంబంధిత వ్యాధి. మెదడులోని ఒక భాగం దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని ప్రొఫెసర్ యేల్ బెన్సౌసన్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి వాయిస్‌ లేదా స్పీచ్‌ హెవీగా ఉంటే అది స్ట్రోక్ ప్రమాదాన్ని సూచిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, జాగ్రత్తగా ఉండాలని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వయసు మళ్లిన వారు నత్తితో మాట్లాడుతూంటే.. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అది పక్షవాతం సంకేతం కావొచ్చని అంటున్నారు. సకాలంలో స్పందించి చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మాట్లాడే సమయంలో గొంతులో నొప్పిగా ఉన్నా, మాట్లాడేప్పుడు ఒత్తిడి ఉన్నా.. వాయిస్ డిజార్డర్ లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. స్వర తంతువులు సరిగ్గా కంపించని కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి గొంతులో వచ్చే ఈ మార్పులు పలు వ్యాధులకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..