ఈ ఐదు రకాల పండ్లు తింటే… జీవితంలో క్యాన్సర్ రాదు..! మరెన్నో రోగాలకు చెక్‌పెట్టొచ్చు..!!

మన శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందే లక్షణం కలిగింది క్యాన్సర్. కొందరిలో వంశపారంపర్యంగా క్యాన్సర్‌ వస్తుంది. మరికొందరిలో వారి జీవనశైలి కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేస్తే ఈ క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాన్సర్‌ని ఖతం చేసే కొన్ని రకాల పండ్లు, వాటి ఉపయోగాలు ఇక్కడ తెలుసుకుందాం...

ఈ ఐదు రకాల పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు..! మరెన్నో రోగాలకు చెక్‌పెట్టొచ్చు..!!
Cancer Fighting Potential

Updated on: Apr 28, 2025 | 1:03 PM

ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి ఇప్పుడు ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. చాపకింద నీరులా చాలా మందిని వేధిస్తోంది. దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కూడా నివేధిక వెల్లడించింది. మన శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందే లక్షణం కలిగింది క్యాన్సర్. కొందరిలో వంశపారంపర్యంగా క్యాన్సర్‌ వస్తుంది. మరికొందరిలో వారి జీవనశైలి కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేస్తే ఈ క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాన్సర్‌ని ఖతం చేసే కొన్ని రకాల పండ్లు, వాటి ఉపయోగాలు ఇక్కడ తెలుసుకుందాం…

* యాపిల్‌:
యాపిల్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు..యాపిల్‌ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని నేరుగా తినడమే కాకుండా జ్యూస్, జామ్, పైస్, కేక్‌లు తయారు చేసుకోవచ్చు.

* బొప్పాయి:
బొప్పాయిలో విటమిన్లు A, B, C పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపీన్ అనే పదార్థాలు బాడీలో క్యాన్సర్ కారకాలు పెరగకుండా చేస్తాయి. దీనిని తినడం వల్ల ఆక్సిడేటివ్‌ని స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. క్యాన్సర్ వచ్చే రిస్క్‌ని తగ్గిస్తుంది. ఇది మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని కెరోటీన్ యూటెరెస్‌ని స్టిమ్యులేట్ చేసి మెనుస్ట్రువల్ సైకిల్‌ని రెగ్యులేట్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల పీరియడ్స్ క్రాంప్స్‌ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

* ద్రాక్ష:
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఫ్లేవ‌నాయిడ్స్‌, రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్స‌ర్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తింటుంటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. ఇది క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తుంది. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గి క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది.

* బెర్రీ ఫ్రూట్స్‌:
స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి బెర్రీలు కూడా క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను ఎదురిస్తాయి. ఈ బెర్రీ ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్, విటమిన్ సి, మ్యాంగనీజ్ సమృద్ధిగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిలో కాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ విషయాన్ని అనేక స్టడీస్ వెల్లడించాయి.

* ప్యాషన్‌ ఫ్రూట్‌:
ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, దీన్ని తినడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్యాషన్‌ ఫ్రూట్‌లో యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నాయి. ఈ పండు తరచుగా తీసుకుంటే.. గ్రాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీనిలో విటమిన్‌ ఏ, సీ యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని ప్రదర్శించి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..