జహీరాబాద్ అత్యాచారం కేసులో కీలక మలుపు..
జహీరాబాద్ అత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు కర్ణాటకలోని బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన తెలంగాణ పోలీస్ టీమ్..రాయ్‌కోడ్ మండలం మహబత్‌పూర్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునేందకు ప్రయత్నించగా..వారు కారులో తప్పించుకునేే ప్రయత్నం చేశారు. అతివేగంతో వెళ్లడంతో..సిరూర్ సమీపంలో నిందితుల కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒక నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుల […]
జహీరాబాద్ అత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు కర్ణాటకలోని బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన తెలంగాణ పోలీస్ టీమ్..రాయ్‌కోడ్ మండలం మహబత్‌పూర్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునేందకు ప్రయత్నించగా..వారు కారులో తప్పించుకునేే ప్రయత్నం చేశారు. అతివేగంతో వెళ్లడంతో..సిరూర్ సమీపంలో నిందితుల కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒక నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుల వరంగల్, కాజీపేట ప్రాంతాలకు చెందిన ప్రవీణ్, వీరభద్రచారి, చిన్న చారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదుగురు బృందంగా ఏర్పడ్డ ఈ ముఠా మహిళలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బీదర్ నుంచి సూర్యపేట బస్సులో వెళ్తోన్న వితంతు మహిళ(35) వద్ద నిషేదిత పదార్థాలున్నాయని చెప్పి ఇద్దరు పోలీసులమని చెప్పుకున్న వ్యక్తులు కిందకి దించారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.