‘అబద్దం నడిచొస్తే ఆయనలా వుంటుంది’

|

Sep 06, 2020 | 3:38 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపం కట్టలు తెంచుకున్నట్టుంది. ఘాటు ఘాటు వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. 'అబద్దం నడిచొస్తే చంద్రబాబులా వుంటుంది. దీనికి తాజా నిదర్శనం.

అబద్దం నడిచొస్తే ఆయనలా వుంటుంది
Follow us on

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపం కట్టలు తెంచుకున్నట్టుంది. ఘాటు ఘాటు వ్యాఖ్యలతో సెటైర్లు వేశారు. ‘అబద్దం నడిచొస్తే చంద్రబాబులా వుంటుంది. దీనికి తాజా నిదర్శనం.. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి గారు సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా అబద్దమాడేశారు చంద్రబాబు. నీ అబద్దాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు ‘ఛీ’బిఎన్. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు’. అంటూ విమర్శలు చేశారు విజయసాయి. ఇటీవల ఏపీ సర్కారు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెం. 22ని ఏపీ సర్కారు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్.. క్యాష్ ట్రాన్స్ ఫర్ గురించి నిన్న టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై విజ‌యసాయిరెడ్డి ఇలా రియాక్ట్ అయ్యారు.