విజయవాడ సెంట్రల్‌ ఫ్యాన్ హవా! 15 ఓట్లతో విష్ణు గెలుపు

విజయవాడ :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  వైసీపీ మొదటి నుంచి ఆధిక్యంలో ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలోని  20 రౌండ్లకు గాను మొదటి 10 రౌండ్లలో వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు 6 వేల ఓట్ల మెజార్టీతో లీడింగ్‌లో ఉన్నారు. మధ్యాహ్నం నుంచి టీడీపీ అభ్యర్ధి బొండా ఉమా స్వల్ప ఆదిక్యతను కనబరుస్తూ వచ్చారు. దీంతో లాస్ట్ రౌండ్ వరకు విజయం ఇద్దరి మధ్య దోబూచులాడింది. చివరి రౌండ్‌లో ఒక ఈవీఎం మిషన్ పని చేయలేదు. దీంతో అధికారులు […]

విజయవాడ సెంట్రల్‌ ఫ్యాన్ హవా! 15 ఓట్లతో విష్ణు గెలుపు

Updated on: May 23, 2019 | 10:36 PM

విజయవాడ :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  వైసీపీ మొదటి నుంచి ఆధిక్యంలో ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలోని  20 రౌండ్లకు గాను మొదటి 10 రౌండ్లలో వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు 6 వేల ఓట్ల మెజార్టీతో లీడింగ్‌లో ఉన్నారు. మధ్యాహ్నం నుంచి టీడీపీ అభ్యర్ధి బొండా ఉమా స్వల్ప ఆదిక్యతను కనబరుస్తూ వచ్చారు. దీంతో లాస్ట్ రౌండ్ వరకు విజయం ఇద్దరి మధ్య దోబూచులాడింది. చివరి రౌండ్‌లో ఒక ఈవీఎం మిషన్ పని చేయలేదు. దీంతో అధికారులు వీవీ ప్యాట్లను లెక్కించారు. గెలుపు వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణును వరించింది. మల్లాది విష్ణు 15 ఓట్ల స్వల్ప మెజార్టీతో బోండా ఉమాపై విజయం సాధించారు. మల్లాది విష్ణు విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.