వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తి

అశ్రునయనాల మధ్య మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. సర్వమత ప్రార్థనలు అనంతరం ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులతో పులివెందుల రోడ్డులు కిటకిటలాడాయి. రాజారెడ్డి సమాధి పక్కనే వివేకాకు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ వైఎస్ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. ‘అజాత శత్రువు’ వివేకానందరెడ్డిని ఆఖరి చూపు చూడటానికి […]

వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తి

Edited By:

Updated on: Mar 16, 2019 | 12:23 PM

అశ్రునయనాల మధ్య మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. సర్వమత ప్రార్థనలు అనంతరం ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులతో పులివెందుల రోడ్డులు కిటకిటలాడాయి. రాజారెడ్డి సమాధి పక్కనే వివేకాకు అంత్యక్రియలు నిర్వహించారు.

కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ వైఎస్ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. ‘అజాత శత్రువు’ వివేకానందరెడ్డిని ఆఖరి చూపు చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.