ఇక పై తల్లి ఖాతాలోనే ఫీజ్‌రీయింబర్స్‌మెంట్..ఏపీ స‌ర్కార్

|

Apr 28, 2020 | 8:59 AM

ఏపీ విద్యా విధానంలో కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్న సీఎం జ‌గ‌న్ స‌ర్కార్..నేడు అదే దిశ‌లో మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. నేడు(మంగ‌ళ‌వారం) జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు జ‌గ‌న్. ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నారు. బడుగు, బ‌ల‌హీన‌ వ‌ర్గాల విద్యార్ధులు కూడా ఉన్న‌త స్థానాల‌కు వెళ్ల‌లన్న‌ సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ స్కీమ్ ద్వారా 12 లక్షల మంది […]

ఇక పై తల్లి ఖాతాలోనే ఫీజ్‌రీయింబర్స్‌మెంట్..ఏపీ స‌ర్కార్
Follow us on

ఏపీ విద్యా విధానంలో కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్న సీఎం జ‌గ‌న్ స‌ర్కార్..నేడు అదే దిశ‌లో మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. నేడు(మంగ‌ళ‌వారం) జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు జ‌గ‌న్. ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నారు. బడుగు, బ‌ల‌హీన‌ వ‌ర్గాల విద్యార్ధులు కూడా ఉన్న‌త స్థానాల‌కు వెళ్ల‌లన్న‌ సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ స్కీమ్ ద్వారా 12 లక్షల మంది తల్లులు, వారి పిల్లలు లబ్ధి పొందుతారని వెల్లడించింది.

రాష్ట్ర చరిత్రలో మొద‌టిసారిగా అన్ని త్రైమాసికాలకు చెల్లించవలిసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనుంది ప్ర‌భుత్వం. ఏపీలో గ‌తంలో లేని విధంగా పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం అందిస్తుంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లించనుంది. ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మొత్తం రూ. 4వేల కోట్లకు పైగా రిలీజ్ చేయనుంది. ఇకపై ప్రభుత్వం ఫీజ్‌రీయింబర్స్‌మెంట్​ను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయనుంది ప్ర‌భుత్వం. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు..సీఎం జ‌గ‌న్ కు మంచి పేరు తీసుకువ‌చ్చాయి.