
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో శనివారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారు. ఎల్పీ సమావేశం ముగిశాక జగన్ హైదరాబాద్ వెళ్లనున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది.