AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కనకదుర్గమ్మ ఆలయ రాజగోపురం ఎదుట ఓ యువతి రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Vijayawada: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇవేం పిచ్చిపనులు.. ఏకంగా రాజగోపురం ముందే..!
Young Woman Making Reels
Balaraju Goud
|

Updated on: Aug 02, 2026 | 11:32 AM

Share

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కనకదుర్గమ్మ ఆలయ రాజగోపురం ఎదుట ఓ యువతి రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన రాజగోపురం ఎదుట ఓ యువతి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరించింది. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత రద్దీగా ఉండే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వీడియో చిత్రీకరణ జరగడం, భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రీల్స్ చిత్రీకరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనతో ఆలయంలో భద్రతా పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. అధికారులు ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us