ఓ 60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడు ప్రేమాయణం సాగించాడు. అంతేకాదు వారి ప్రేమను ఎవరూ అంగీకరించరని తెలుసుకుని పారిపోదామని కూడా అనుకున్నారట. అయితే ఈ విషయం కాస్తా వారిద్దరి ఇళ్లల్లో తెలవడంతో పోలీస్ కేసు వరకూ వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ ఆరవై ఏళ్ల బామ్మకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితమే అమ్మమ్మ కూడా అయ్యింది. కాగా వాళ్లింటికి దగ్గరలోనే ఓ యువకుడు నివసిస్తున్నాడు. రోజూ బామ్మ ఇంటికి వెళ్లి వస్తూండటంతో.. బామ్మపై యువడికి ప్రేమ చిగురించింది. ఇంకేముంది.. బామ్మకు ప్రపోజ్ చేశాడు. కట్ చేస్తే ఇద్దరూ వీరి ప్రేమకు ఎవరూ ఒప్పుకోరని గ్రహించి పారిపోదామనుకున్నారు. అయితే వీరిద్దరి తీరునూ.. పసిగట్టిన ఆ బామ్మ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులతో యువకుడు కూడా వచ్చాడు. దీంతో ఇరువైపుల వారు ఘర్షణ పడ్డారు. దీంతో యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.