అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ఛానెల్ రద్దును యూట్యూబ్ మరో వారం రోజులపాటు పొడిగించింది. క్యాపిటల్ హిల్ లో లోగడ జరిగిన హింస, అల్లర్లకు ట్రంప్ బాధ్యుడని భావిస్తున్న కారణంగా యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత వారం ట్రంప్ అకౌంట్ నుంచి ఓ కొత్త వీడియోను యూ ట్యూబ్ తొలగించింది, తమ కంటెంట్ పాలసీలను అతిక్రమించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. మరో 7 రోజులపాటు కొత్త వీడియోలను గానీ, లైవ్ స్ట్రీమ్ ను గానీ అప్ లోడ్ చేయరాదని కూడా ఆయనకు సూచించింది. ట్రంప్ కు యూట్యూబ్ ఫాలోవర్లు 2 మిలియన్లకు పైగానే ఉన్నారు. మంగళవారం తాత్కాలిక సస్పెన్షన్ ముగియాల్సి ఉండగా దాన్ని వారం రోజులు పొడిగించారు. అవసరమైతే దీన్ని మరికొంత కాలం పొడిగించవచ్ఛు కూడా అని తెలుస్తోంది. తన అభిప్రాయాలను, తన మద్దతుదారుల వ్యాఖ్యలు, తన దైనందిన కార్యకలాపాలకు ట్రంప్ తన వీడియోల ద్వారా ప్రజలకు చేరువై మళ్ళీ దూరమయ్యారు.