నిరుద్యోగులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. దీపావళి రోజున ప్రకటించే అవకాశం..

| Edited By: Ravi Kiran

Nov 12, 2020 | 9:59 PM

నిరుద్యోగులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించబోతోంది. కరోనా ప్రభావంతో నిరుద్యోగులుగా మారిన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా యూపీ సర్కార్ సరికొత్త పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది

నిరుద్యోగులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. దీపావళి రోజున ప్రకటించే అవకాశం..
Follow us on

నిరుద్యోగులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించబోతోంది. కరోనా ప్రభావంతో నిరుద్యోగులుగా మారిన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా యూపీ సర్కార్ సరికొత్త పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీపావళి పండుగ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘మిషన్ రోజ్‌గార్’ పేరుతో దీన్ని ప్రారంభించేందుకు యోగి సర్కార్ ఫ్లాన్ చేసింది.

ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు దాదాపు 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద యువతీ, యువకులు ఆయా ప్రభుత్వ శాఖల్లో, మండళ్లు, కార్పొరేట్లు తదితర సంస్థల్లో ఉద్యోగాల కోసం దరాఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం చొరవతో ప్రయివేటు రంగంలో కూడా అనేక కొత్త అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే ‘మిషన్ రోజ్‌గార్’ అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు యూపీ సీఎస్ రాజేంద్ర కుమార్ తివారీ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాందుకు బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందని ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.