ఇకపై పీఎఫ్‌కి…నో మోర్ న్యూ అప్లికేషన్స్

|

Mar 11, 2019 | 7:06 AM

దిల్లీ: ఇకపై ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్‌కి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆటోమేటిక్‌ పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగులకు యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ -యూఏఎన్‌ ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈపీఎఫ్‌ క్లెయింల విషయమై అప్లికేషన్ సమర్పించాల్సి వస్తోంది. ఏటా ఇలాంటి దరఖాస్తులు ఎనిమిది లక్షల వరకు వస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. […]

ఇకపై పీఎఫ్‌కి...నో మోర్ న్యూ అప్లికేషన్స్
Follow us on

దిల్లీ: ఇకపై ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్‌కి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆటోమేటిక్‌ పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగులకు యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ -యూఏఎన్‌ ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈపీఎఫ్‌ క్లెయింల విషయమై అప్లికేషన్ సమర్పించాల్సి వస్తోంది. ఏటా ఇలాంటి దరఖాస్తులు ఎనిమిది లక్షల వరకు వస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి.

లావాదేవీలన్నింటినీ కాగిత రహితంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆటోమేటిక్‌ పద్ధతిలో క్లెయింలను మార్పిడి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త యజమాని నూతనంగా చేరిన ఉద్యోగి పేరున నెలవారీ పీఎఫ్‌ చందాను చెల్లించేటప్పుడే యూఏఎన్‌ను పేర్కొంటారని, దాని ఆధారంగా అతని ఖాతాలో సొమ్ము జమ అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాత యజమాని జమ చేసిన సొమ్ము, దానిపై వచ్చిన వడ్డీ అన్నీ కొత్త ఖాతాలో జమ అవుతాయి. అంటే ఇక నుంచి యూఏఎన్‌ కూడా బ్యాంకు ఖాతా మాదిరిగానే పనిచేస్తుంది. ఎన్ని ఉద్యోగాలు, ప్రదేశాలు మారినా జీవితాంతం పీఎఫ్‌ ఖాతా మాత్రం మారదు.