YCP reverse attack: చంద్రబాబును చెడుగుడు ఆడిన వైసీపీ నేతలు

|

Feb 27, 2020 | 5:46 PM

ఓవైపు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద టెన్షన్ కొనసాగుతుండగానే.. చంద్రబాబుపై ఎదురు దాడి మొదలుపెట్టింది వైసీపీ. ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్... టీడీపీ అధినేతను చెడుగుడు ఆడుకున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా ఆయన్ను అభివర్ణించారు.

YCP reverse attack: చంద్రబాబును చెడుగుడు ఆడిన వైసీపీ నేతలు
Follow us on

YCP leaders reverse attack on Chandrababu: విశాఖలో ఒకవైపు టెన్షన్ కొనసాగుతుంటే.. మరోవైపు చంద్రబాబు మీద ఎదురుదాడికి దిగారు వైసీపీ నేతలు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్.. అమరావతిలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై మాటలయుద్దం జరిపారు. విపరీత పదజాలంతో విరుచుకుపడ్డారు.

Read this: మెగాస్టార్‌కు అమరావతి సెగ

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేసిన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్ర ద్రోహిగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏ నాయకుని మీద దాడులను వైసీపీ సమర్దించదని, కానీ ప్రజాభిమతాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా వుందని వారంటున్నారు.

Read this: జనసేన ఏకైక ఎమ్మెల్యే వెరైటీ కామెంట్స్

ఉత్తరాంధ్రకి అభివృద్ధి వద్దు అని చంద్రబాబు తన యాత్ర తో చెప్పదలచుకొన్నాడా? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దు అని చంద్రబాబు అంటుంటే అక్కడి ప్రజలు ఇంకెలా స్వాగతిస్తారని అంటున్నారు. రాజధాని అంశం కేవలం వైసీపీ కార్యకర్తలకి సంబంధించిన అంశం మాత్రమే కాదని, చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి కాబట్టే విశాఖలో ఉన్న ప్రజానీకం, జేఏసీ సంఘాలు ఆయన రావద్దంటూ ఉద్యమించాయని చెబుతున్నారు.

Read this: చంద్రబాబు దారి జైలుకే… రోజా జ్యోతిష్యం నిజమేనా?

2017లో విశాఖ క్యాండిల్ ర్యాలీకి వెళ్లిన జగన్‌ని ఎయిర్‌పోర్టు నుండి బయటకు రానిచ్చారా..? అని నిలదీశారు అంబటి రాంబాబు. ‘‘అప్పుడు జగన్‌ని అపమని ప్రజలు ఎవరు రాలేదు….ఈ రోజు మిమ్మల్ని అడ్డుకోటానికి ప్రజలు వచ్చారు…. అప్పుడు మమ్మల్ని అడ్డుకున్నారు అని మేము ఈ రోజు చంద్రబాబుని అడ్డుకోలేదు… చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది అని ఆయన్ని వెనక్కి పంపారు…..’’ అంటూ చెప్పుకొచ్చారు రాంబాబు.

Read this: హైదరాబాద్‌లో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు బంద్!