కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన విజయసాయి

నేర రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎలక్ట్రోరల్ రిఫార్మ్స్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నంతకాలం ధనబలం, కండబలంతో రాజకీయాలను నేరమయంగా మార్చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. గత 50 ఏళ్ల పాలనలో ప్రత్యర్ధులను వేదించడమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తీవ్రస్ధాయిలో ఫైరయ్యారు విజయసాయి. అదే సమయంలో తప్పుడు కేసుల్లో ఇరికించి వేధింపులకు […]

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన విజయసాయి

Edited By:

Updated on: Jul 03, 2019 | 8:44 PM

నేర రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎలక్ట్రోరల్ రిఫార్మ్స్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేశారు.

అధికారంలో ఉన్నంతకాలం ధనబలం, కండబలంతో రాజకీయాలను నేరమయంగా మార్చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. గత 50 ఏళ్ల పాలనలో ప్రత్యర్ధులను వేదించడమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తీవ్రస్ధాయిలో ఫైరయ్యారు విజయసాయి. అదే సమయంలో తప్పుడు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడంతో పాటు.. వారిని నిందితులుగా బ్రాండింగ్ వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. సభలో  కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలో ఆపార్టీ ఎంపీలు జైరాం రమేశ్, బీకే హరిప్రసాద్ వంటి ఎంపీలు విజయసాయిరెడ్డిని  అడ్డుకునే ప్రయత్నం చేశారు.