సీఎం జగన్ ఇచ్చిన మాట నిలుపుకుంటారు : విజయసాయి ట్వీట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2019 | 3:24 PM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ ప్రభుత్వంపై ట్వీటర్ వేదికగా విమర్శలు చేశారు. ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీగా చేస్తామని అమరావతిని గ్రాఫిక్స్ దశలోనే ఉంచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి విచ్చలవిడిగా అప్పులు తెచ్చి దివాలా తీయించారని ఆయన ఆరోపించారు. కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్ధల ద్వారా రుణంగా తెచ్చిన లక్షకోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని, తుపాన్లు, కరువు కాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయరంగాన్ని గత ప్రభుత్వం ఆదుకోలేకపోయిందన్నారు. తమ వైసీపీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రత్యేక బడ్జెట్‌తో ఊపిరి పోస్తుందని […]

సీఎం జగన్ ఇచ్చిన మాట నిలుపుకుంటారు : విజయసాయి ట్వీట్
Follow us on

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ ప్రభుత్వంపై ట్వీటర్ వేదికగా విమర్శలు చేశారు. ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీగా చేస్తామని అమరావతిని గ్రాఫిక్స్ దశలోనే ఉంచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి విచ్చలవిడిగా అప్పులు తెచ్చి దివాలా తీయించారని ఆయన ఆరోపించారు. కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్ధల ద్వారా రుణంగా తెచ్చిన లక్షకోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని, తుపాన్లు, కరువు కాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయరంగాన్ని గత ప్రభుత్వం ఆదుకోలేకపోయిందన్నారు. తమ వైసీపీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రత్యేక బడ్జెట్‌తో ఊపిరి పోస్తుందని తెలిపారు విజయసాయి.

రూ.29 వేల కోట్ల కేటాయింపులు రైతన్నలను సంక్షోభాల నుంచి గట్టెక్కిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే వడ్డీలేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు మాట ఇచ్చిన సీఎం జగన్ తన మాట నిలుపుకుంటారని ట్వీట్ చేశారు.

శుక్రవారం ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరకంగా వార్ ఆఫ్ వర్డ్స్‌లా అసెంబ్లీ తయారైంది. మరోవైపు టీడీపీ నేత లోకశ్ ఎప్పటిలాగే ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.