ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కాకపోతే.. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామని అన్నారామె. సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చినా.. దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దిగజారి వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుకు మానవత్వం లేదని విమర్శించారని రోజా విమర్శించారు.