ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నివాసాన్ని ఖాళీ చేయిస్తామని చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణమని చెప్పారాయన. కరకట్టపై అక్రమ నిర్మాణాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆర్కే మాట్లాడారు. సీఆర్డీఏ ఛైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారని, కానీ ఆ పదవి తనకు ఇస్తారో లేదో తెలీదని చెప్పారాయన.
కాగా.. అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, లోకేష్ ఎదురుపడ్డారు. ఒకరికొకరు పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.