
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు కూడా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై పార్టీలతో పాటూ ప్రముఖులందరూ స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ పేరుతో ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంటర్ ఫలితాల విషయంలో ఫ్రభుత్వాన్ని, కేసీఆర్‌ను నిందిచొద్దంటూ జగన్ ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
‘తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. కావున కేసీఆర్ గారిని వైసీపీ కార్యకర్తలు ఏమీ అనొద్దు అని నా మనవి’అన్నది ట్వీట్ సారాంశం. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్ వైసీపీ నేతల దృష్టికి వెళ్లడంతో… ఈ ఫేక్ ట్వీట్‌పై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.