AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శిలలపై వివాదాన్ని చెరిపేసిన శిల్పులు..!

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో నెలకొన్న వివాదం సమసిపోయింది. శిలలపై చెక్కిన రాజకీయ నేతల శిల్పాలను శిల్పులు చెరిపేశారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అక్కడి రాతి స్థంభాలపై కేసీఆర్, కారు, చార్మినార్, మరి కొంత మంది రాజకీయ నేతల చిత్రాలను చెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది వివాదం రాజుకుంది. హిందూ ఆలయంలో రాజకీయాలేంటి అంటూ టీఆర్ఎస్ పార్టీపై హిందూ సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే తొలుత కొందరు అధికారులు సమర్థించుకున్నా.. […]

శిలలపై వివాదాన్ని చెరిపేసిన శిల్పులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 09, 2019 | 9:17 AM

Share

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో నెలకొన్న వివాదం సమసిపోయింది. శిలలపై చెక్కిన రాజకీయ నేతల శిల్పాలను శిల్పులు చెరిపేశారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అక్కడి రాతి స్థంభాలపై కేసీఆర్, కారు, చార్మినార్, మరి కొంత మంది రాజకీయ నేతల చిత్రాలను చెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది వివాదం రాజుకుంది. హిందూ ఆలయంలో రాజకీయాలేంటి అంటూ టీఆర్ఎస్ పార్టీపై హిందూ సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే తొలుత కొందరు అధికారులు సమర్థించుకున్నా.. హిందూ సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాతి స్థంభాలపై చెక్కిన రాజకీయ నేతల చిత్రాలను చెరిపేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణంలో అష్టభుజి ప్రాకారం రాతి స్తంభాలపై ఏర్పాటు చేసిన వివాదాస్పద చిత్రాలను తొలగించారు.

చిత్రాలను తొలగించిన వాటి స్థానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను చెక్కుతున్నారు. సీఎం కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలు, నెహ్రూ, గాంధీ, రాజీవ్, చార్మినార్, కమలం పువ్వు చిహ్నాలు తీసివేశామని.. స్థాపతి ఆనంద్ వేలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ తోపాటు ఇతర చిత్రాలను చెక్కడంలో ప్రభుత్వ పాత్ర లేదని.. శిల్పులు వారిపై ఉన్న అభిమానంతోనే చెక్కారని మరోసారి వివరణ ఇచ్చారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. తమ దృష్టికి తీసుకొస్తే.. సరిచేస్తామని తెలిపారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..