అతనికి గుణపాఠం చెప్పాలనే..

కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్‌పై దాడి చేసిన వ్యక్తిని తరుణ్ గజ్జర్‌గా గుర్తించారు పోలీసులు. సురేంద్ర నగర్‌లో హార్దిక్ పటేల్ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతుండగా ఈ వ్యక్తి ఆయనపై దాడి చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను కొట్టుకుంటూ.. తీసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణ్ గజ్జర్, తాను హార్దిక్‌పై దాడి చేయడానికి గల కారణాలను వివరించాడు. పటీదార్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో బంద్ పరిస్థితులు నెలకొన్నాయని.. ఆ సమయంలో గర్భవతిగా […]

అతనికి గుణపాఠం చెప్పాలనే..

Edited By:

Updated on: Apr 19, 2019 | 4:59 PM

కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్‌పై దాడి చేసిన వ్యక్తిని తరుణ్ గజ్జర్‌గా గుర్తించారు పోలీసులు. సురేంద్ర నగర్‌లో హార్దిక్ పటేల్ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతుండగా ఈ వ్యక్తి ఆయనపై దాడి చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను కొట్టుకుంటూ.. తీసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణ్ గజ్జర్, తాను హార్దిక్‌పై దాడి చేయడానికి గల కారణాలను వివరించాడు.

పటీదార్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో బంద్ పరిస్థితులు నెలకొన్నాయని.. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న తన భార్య ట్రీట్‌మెంట్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపాడు. మరో సమయంలో అహ్మదాబాద్‌లో తన బిడ్డకు మందులు తీసుకు రావడానికి వెళితే.. అక్కడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించాడు. రాస్తారోఖోలు చేస్తూ.. అదే పనిగా గుజరాత్‌లో బంద్‌కు పిలుపునివ్వడానికి.. ఆయనెవరని ప్రశ్నించాడు. తరుణ్ గజ్జర్ ఏ పార్టీకీ చెందిన వాడు కాదని, సాధారణ వ్యక్తి అని చెప్పిన సురేంద్రనగర్ పోలీసులు అతనిపై చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.