శివునికి గోడు వెళ్లబోసిన రచయిత రామ జోగయ్య

|

Aug 30, 2020 | 12:57 PM

కొవివ్ 19 భూతం యావత్ భూగోళాన్నీ భయకంపితం చేస్తుంటే జనం గోడును దేవుడికి వెళ్లబోశారు సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. కరోనా మహమ్మరిని ప్రాలదోలి ప్రజల్ని రక్షించవయ్యా శివా.. అనే అర్థంలో ఈ పాట రచించారు జోగయ్య శాస్త్రి. ‘హే సీశైలం మల్లయ్యా మా భూగోళం మంచిగ లేదయ్యా.. నీ ఆవేశాలు చాలు చాలు అట్టా శివాలెత్తమాకయ్యా శివయ్యా’ అంటూ మొదలైన ఈ పాట ‘ఆ మూడో కన్ను అట్నే మూసి ఉంచయ్యా’, ‘నీవే […]

శివునికి గోడు వెళ్లబోసిన రచయిత రామ జోగయ్య
Follow us on

కొవివ్ 19 భూతం యావత్ భూగోళాన్నీ భయకంపితం చేస్తుంటే జనం గోడును దేవుడికి వెళ్లబోశారు సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. కరోనా మహమ్మరిని ప్రాలదోలి ప్రజల్ని రక్షించవయ్యా శివా.. అనే అర్థంలో ఈ పాట రచించారు జోగయ్య శాస్త్రి. ‘హే సీశైలం మల్లయ్యా మా భూగోళం మంచిగ లేదయ్యా.. నీ ఆవేశాలు చాలు చాలు అట్టా శివాలెత్తమాకయ్యా శివయ్యా’ అంటూ మొదలైన ఈ పాట ‘ఆ మూడో కన్ను అట్నే మూసి ఉంచయ్యా’, ‘నీవే వీరభద్రుడివైతే అంతే సంగతి’.. అంటూ సాగి ‘చల్లబడరా మా అయ్య’ అంటూ ఈ పాట ముగుస్తుంది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాసి, తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటను అభిమానులు షేర్, లైక్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.