AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Water: హడలెత్తిస్తున్న యూఎన్ నివేదిక.. 2050 నాటికి దుర్భర జీవితమే!.. ప్రపంచంలోని సంగం మంది..

World water: అంగారక గ్రహంపై నీటి జాడలను కనుగొనడానికి మానవుడు ఎందుకు అంత ఉత్సాహం చూపుతున్నాడు? భూమిపై ఉన్న ‘నీలి..

World Water: హడలెత్తిస్తున్న యూఎన్ నివేదిక.. 2050 నాటికి దుర్భర జీవితమే!.. ప్రపంచంలోని సంగం మంది..
Un Water Record
Shiva Prajapati
|

Updated on: Mar 23, 2021 | 5:48 AM

Share

World water: అంగారక గ్రహంపై నీటి జాడలను కనుగొనడానికి మానవుడు ఎందుకు అంత ఉత్సాహం చూపుతున్నాడు? భూమిపై ఉన్న ‘నీలి బంగారం’(నీరు)కు ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు? ఇదే విషయాన్ని ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2021 అడుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నీటిని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీటిని ఎందుకు విలువైనదిగా చూడటం లేదంటూ ప్రశ్నిస్తోంది. ఎందుకు నీటి విలువను తక్కువగా అంచనా వేస్తారంటోంది. నీటిని తక్కువ అంచనా వేస్తే జరిగే పరిణామాలను అంచనా వేయడం కూడా కష్టమే అంటోంది సదరు నివేదిక. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచ నీటి అభివృద్ధి నివేదికను తాజాగా విడుదల చేశారు. ‘‘మంచి నీటికి చాలా మంది విలువ ఇవ్వడం లేదు. దాని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నీటి వృధా చేయడం సరైన చర్య కాదు’ అంటూ యూఎన్ వాటర్ విభాగం చైర్మన్ గిల్బర్ట్ పేర్కొన్నారు. ఓవైపు నీటి కోసం పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు రోజు రోజు వేడెక్కుతున్న భూమి. ఫలితంగా సామాన్య ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నీటిని వృథా చేయడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

యూఎన్ ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2021 ప్రకారం నీటి గురించి 10 వాస్తవాలు.. 1. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో నలుగురికి సరిపడా సురక్షితమైన తాగునీరు లేదు. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో సగానికి పైగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను మించి జనాభా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. 2. నీటి సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలలో 2 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఒక నెలపాటు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాల్లో 4 బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. 3. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు పిల్లలలో ఒకరికి వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత నీరు అందుబాటులో ఉండటం లేదు. ఇంకా 80 కంటే ఎక్కువ దేశాలలో పిల్లలు అధిక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 4. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో అటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు అత్యధికంగా ఉన్నారు. 58% మంది ప్రతిరోజూ తగినంత నీటి సౌలభ్య పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఇద్దరు, లేదా 3 బిలియన్ల మందికి ఇంట్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి నీటి సౌకర్యం లేదు. ఇందులో పేద దేశాలలో దాదాపు మూడొంతుల మంది ఉన్నారు. 6. 140 తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం కల్పించడానికి సంవత్సరానికి 114 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే సురక్షితమైన నీటి కొరత ఏర్పడటం వలన కలిగే సామాజిక మరియు ఆర్ధిక పరిస్థితులను అంచనా వేయడం కష్టం. 7. గత 100 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. 1980 ల నుండి సంవత్సరానికి 1% చొప్పున పెరుగుతూనే ఉంది. 8. ప్రపంచ నీటి ఉపసంహరణలో వ్యవసాయం దాదాపు 70% ఉంది. ప్రధానంగా నీటిపారుదల కోసం మాత్రమే కాకుండా పశువులు, ఆక్వాకల్చర్ కోసం కూడా నీటిని ఉపయోగిస్తున్నారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ నిష్పత్తి 95% వరకు ఉంటుంది. 9. వాతావరణంలో కలిగే మార్పులు కూడా నీటి లభ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 10. ఐస్ కవర్లు, హిమానీనదాలను కరగడం, ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉందని, భవిష్యత్‌లో వందల మిలియన్ల మందికి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చని చెబుతున్నారు యూఎన్ అధికారులు.

Also read:

West Bengal Election 2021: బీజేపీ నిజస్వరూపం బయటపడింది.. ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి..

FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు యాక్సిస్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలివే..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..