బాత్ టబ్ లో పాలతో స్నానం ! ఇదెక్కడి చోద్యం ?

టర్కీలో ఓ పాడిపరిశ్రమకు సంబంధించిన ప్లాంట్ లో పని చేసే ఓ వర్కర్ కి రోజూ పాలను చూసీ, చూసీ మనసు ఎగిరి గంతేసింది. మామూలుగా రోజూ నీటితో చేసే స్నానం కన్నా మిల్క్ బాత్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే ఎవరూ లేనిది చూసి ప్లాంట్ లోని మిషన్ బాయిలర్స్ నుంచి ట్యూబ్స్ ఏర్పాటు చేసుకుని ఎంచక్కా పాలతో కూడిన టబ్ లో తాపీగా స్నానం చేసేశాడు. కోన్యా ప్రావిన్స్ లో జరిగిన ఈ వైనాన్ని […]

బాత్ టబ్ లో పాలతో స్నానం ! ఇదెక్కడి చోద్యం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 09, 2020 | 6:46 PM

టర్కీలో ఓ పాడిపరిశ్రమకు సంబంధించిన ప్లాంట్ లో పని చేసే ఓ వర్కర్ కి రోజూ పాలను చూసీ, చూసీ మనసు ఎగిరి గంతేసింది. మామూలుగా రోజూ నీటితో చేసే స్నానం కన్నా మిల్క్ బాత్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే ఎవరూ లేనిది చూసి ప్లాంట్ లోని మిషన్ బాయిలర్స్ నుంచి ట్యూబ్స్ ఏర్పాటు చేసుకుని ఎంచక్కా పాలతో కూడిన టబ్ లో తాపీగా స్నానం చేసేశాడు. కోన్యా ప్రావిన్స్ లో జరిగిన ఈ వైనాన్ని టిక్ టాక్ లో ఒకరు అప్ లోడ్ చేసి వదిలాడు. సాయర్ అనే ఇతగాడిని ప్లాంట్ యాజమాన్యం తొలగించింది. కానీ ఈ మనిషి పాలతో స్నానం చేయలేదని, నీళ్లు, క్లీనింగ్ లిక్విడ్ కలిసిన మిశ్రమంలో ఈ వైభోగం వెలగబెట్టాడని యాజమాన్యం తెలిపింది. మొత్తానికి ఈ కర్మాగారాన్ని మూసివేశారు.