రైతు చట్టాల వ్యతిరేక ప్రదర్శనలో ఇక మేమూ, హర్యానా మహిళల ట్రాక్టర్ ట్రాలీలతో ప్రొటెస్ట్ కు రెడీ

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 11:41 AM

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా మహిళలు కూడా రంగంలోకి దిగుతున్నారు..

రైతు చట్టాల వ్యతిరేక ప్రదర్శనలో ఇక మేమూ, హర్యానా మహిళల  ట్రాక్టర్ ట్రాలీలతో ప్రొటెస్ట్ కు రెడీ
Follow us on

Farmers Protest: రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా మహిళలు కూడా రంగంలోకి దిగుతున్నారు.  హర్యానా లోని జింద్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఇందుకు నడుం బిగించారు. వీరి కుటుంబ సభ్యులు కూడా వీరిని ప్రోత్సహిస్తున్నారు. ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగే కిసాన్ పరేడ్ లో మేము కూడా పాల్గొంటామని మహిళలు చెబుతున్నారు. ఇందుకు ఇప్పటినుంచే వీరు ట్రాక్టర్ ట్రాలీలను నడుపుతున్నారు. సమీప గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో మహిళలు జింద్ కు చేరుకుంటున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యాన వీరంతా ఈ వినూత్న నిరసనకు సై అంటున్నారు.

కాగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు ‘మూవీ’ రేపు చూస్తారని రైతు సంఘాలు పేర్కొన్నాయి. జనవరి 26 తో రైతుల ఆందోళన మొదలై రెండు నెలలు అవుతాయి.

Also Read:

Big Breaking: ఏ క్షణంలోనైనా తెలంగాణ పీసీసీ చీఫ్ పేరు ప్రకటించే అవకాశం..!

Hyderabad Metro: హైద‌రాబాద్‌ మెట్రో సేవ‌ల‌కు అంత‌రాయం… సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సేవలు…

Central Vista: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇద్దరు న్యాయమూర్తులు అనుకూలం.. ఒకరు వ్యతిరేకం..