గగన్‌యాన్‌లో మహిళలు ఉండరా?

|

Aug 29, 2019 | 5:57 AM

భారత అంతరిక్ష చరిత్రలో ఎంతో గొప్పదిగా, ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. దీని ద్వారా 2022 నాటికి భారత ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో టార్గెట్ పెట్టుకుంది. ఈ వ్యోమగాముల్లో ఓ మహిళ కూడా ఉండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి అవకాశమేదీ లేదని తాజాగా ఇస్రో వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సాయుధ బలగాల్లో ఫ్లయింగ్‌ అనుభవం ఉన్న టెస్ట్‌ పైలట్లను వ్యోమగాములను మాత్రమే పంపాలని, ఈ విషయంలో ఎటువంటి రిస్క్ చేయకూడదని ఇస్రో […]

గగన్‌యాన్‌లో మహిళలు ఉండరా?
Women Astronauts Unlikely To Be Part Of Inaugural Gaganyaan Flight
Follow us on

భారత అంతరిక్ష చరిత్రలో ఎంతో గొప్పదిగా, ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. దీని ద్వారా 2022 నాటికి భారత ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో టార్గెట్ పెట్టుకుంది. ఈ వ్యోమగాముల్లో ఓ మహిళ కూడా ఉండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి అవకాశమేదీ లేదని తాజాగా ఇస్రో వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సాయుధ బలగాల్లో ఫ్లయింగ్‌ అనుభవం ఉన్న టెస్ట్‌ పైలట్లను వ్యోమగాములను మాత్రమే పంపాలని, ఈ విషయంలో ఎటువంటి రిస్క్ చేయకూడదని ఇస్రో భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో మహిళలెవరూ లేకపోవడంతో గగన్‌యాన్‌లో మహిళలకు అవకాశం ఉండకపోవచ్చని ఒక ఇస్రో అధికారి తెలిపారు.

ఈ మిషన్‌లో భాగంగా ఇస్రో ఇప్పటికే వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. వీరిలో ముగ్గురిని ఎంపిక ఎంపిక చేసి..మొదట భారత్‌లో.. తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. ఎవరిసాయం లేకుండా  మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది.