వళ్ళు గగురుపొడిచే ఘటన ఒకటి అగ్రరాజ్యంలో జరిగింది. ఒక నిండు గర్భిణిని చంపి ఆమె కడుపులో నుంచి బిడ్డను తీసుకుంది ఒక మహిళ. ఈ ఘాతుకానికి పాల్పడ్డ టేలర్ పార్కర్(27) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. టేలర్ పార్కర్ నేరారోపణతో టెక్సాస్ జైలులో ఉంది. అయితే, గత గురువారం నాడు 5 మిలయన్ డాలర్ల పూచికత్తుపై ఆమె బెయిల్‌పై విడుదలైంది. జైలు నుంచి బయటకు వచ్చిందే తడవుగా ఆమె మరో ఘాతుకానికి పాల్పడింది. ఒక గర్భిణిని చంపి ఆమె బిడ్డను తనకు పుట్టిన శిశువుగా తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చింది. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ తిన్న వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తనకు రోడ్డు పక్కన కానుపు అయ్యిందని ఆసుపత్రిలో వారికి కట్టుకథలు చెప్పింది. శిశువు శ్వాస తీసుకోవడం లేదని వెంటనే చికిత్స అందించాలని కోరింది. బిడ్డను పరిశీలించిన డాక్టర్లు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్కర్‌ను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. చనిపోయిన మహిళ మృతదేహాన్ని పార్కర్ ఉంటున్న ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో గుర్తించారు. మహిళ కిడ్నాప్, హత్య ఆరోపణలపై పార్కర్‌ను పోలీసలు మరోసారి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.