అక్రమ సంబంధాలు క్రైమ్‌కు దారితీస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు అనేేకం నమోదయ్యాయి. అక్రమ సంబంధం నేపథ్యంలో తాజాగా ఓ మహిళ క్రూరంగా ప్రవర్తించింది. కన్నబిడ్డనే చిదిమేసింది. హృదయాన్ని కదలించే ఈ ఘటన ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తొర్తికి చెందిన నవ్యను తాళ్లరాంపూర్‌కు చెందిన అభిషేక్ అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి నాగేంద్ర అనే నాలుగేళ్ల తనయుడు ఉన్నాడు. నవ్యకు వివాహేతర సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగి… కొంతకాలంగా ఇరువురు దూరంగా ఉంటున్నారు. ఏడాదిగా మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవల అభిషేక్ ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. నవ్య తన కొడుకుతో కలిసి అమ్మనాన్నలతో కలిసి ఉంటోంది. అయితే తన అక్రమ సంబంధానికి కొడుకు అడ్డగా ఉన్నాడని భావించిన ఆమె.. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బాబుని గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తనకేం తెలియనట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. నవ్య మాటల్లో తడబాటు కనిపించడంతో.. అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించడంతో.. తానే హత్య చేసినట్లు అంగీకరించింది. బాలుడి మృతదేహాన్ని తండ్రి తరఫు బంధువులు తాళ్లరాంపూర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ సంబంధం మోజులో పడి చివరికి కటకటాల వెనక్కి వెళ్లింది నవ్య. కన్న బిడ్డను చేతులారా చంపుకుంది. కట్టుకున్న భర్తను వదిలేసింది. ఇప్పుడు కుటుంబంతో పాటు సమాజంతో కూడా ఛీ అనిపించుకుంది. తప్పుకు పర్వావసనం తప్పదని నవ్య ఉదంతం హెచ్చరిస్తోంది.
Also Read :
ఆరోగ్యంతోనే వికాసం, దేశ ప్రజలకు వెలుగులు విరజిమ్మే దీపావళి శుభాకాంక్షలు, ప్రధాని మోదీ
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా వైట్ హౌస్ ట్రంప్ దేనా ? రెండోసారీ ఆయనదే భవనమంటున్న అధికారి