ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మైలురాయిని చేరబోతోంది. పాజిటివ్ కేసుల సరళిని చూస్తే, వచ్చే రెండు మూడు రోజుల్లోనే ఈ సంఖ్యకు చేరకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం భారత్‌లో గత 24 గంటల్లో 26,382 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఫలితంగా దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,32,548కు చేరింది. ఇక గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 33,813 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 387 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,44,096కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,56,449 మంది కోలుకోగా, 3,32,002 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.