చిక్కుల్లో ప్రభాస్.. కారణం అదేనా..?

| Edited By:

Aug 05, 2019 | 8:07 PM

ప్రభాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టు బాహుబలి ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. ఆ రెండు సినిమాల ప్రమోషన్ సమయంలో ప్రభాస్ నార్తిండియాలో జక్కన్నతో పాటు తెగ తిరిగేశాడు. ఆ టైమ్‌లో డార్లింగ్ పడ్డ తంటాలు అంత ఇంతా కాదు. ఎక్కడికి వెళ్లినా స్వీటీతో పెళ్లెప్పుడు.. అంటూ అభిమానులు ప్రశ్నించేవారు. ఇక ఇప్పుడు సాహో సీజన్ వచ్చేసింది. యాక్షన్ సీన్స్‌లో హాలీవుడ్ రేంజ్‌‌‌లో నటించాడు ప్రభాస్. అయితే ప్రమోషన్ టైమ్ వచ్చేసరికి కాస్త వెనక్కు తగ్గుతున్నాడు. ఇంకో […]

చిక్కుల్లో ప్రభాస్.. కారణం అదేనా..?
Follow us on

ప్రభాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టు బాహుబలి ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. ఆ రెండు సినిమాల ప్రమోషన్ సమయంలో ప్రభాస్ నార్తిండియాలో జక్కన్నతో పాటు తెగ తిరిగేశాడు. ఆ టైమ్‌లో డార్లింగ్ పడ్డ తంటాలు అంత ఇంతా కాదు. ఎక్కడికి వెళ్లినా స్వీటీతో పెళ్లెప్పుడు.. అంటూ అభిమానులు ప్రశ్నించేవారు. ఇక ఇప్పుడు సాహో సీజన్ వచ్చేసింది. యాక్షన్ సీన్స్‌లో హాలీవుడ్ రేంజ్‌‌‌లో నటించాడు ప్రభాస్. అయితే ప్రమోషన్ టైమ్ వచ్చేసరికి కాస్త వెనక్కు తగ్గుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఎందుకంటే.. ఇక్కడ కూడా అదే తంటా. ప్రభాస్‌కి పెళ్లి కళ వచ్చేసింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అమెరికాలో సెటిలైన ఒక ఎన్నారై కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్సయిందట. రెబల్ స్టార్ కృష్ణంరాజే ఈ ప్రపోజల్‌ని మూవ్ చేశారని.. ఈ వింటర్‌లోనే ముహూర్తం కూడా వుండొచ్చని ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు సాహో ప్రమోషన్స్ కోసం జనంలోకి వస్తే మళ్లీ ప్రభాస్‌ని ఎటాక్ చేసే ఇష్యూ కూడా ఇదే. అసలే దేశమంతా మహానగరాల్లో టూర్ ప్లాన్ చేసింది సాహో ప్రమోషన్ యూనిట్. ఇక స్టేజ్ మీదెక్కి మీడియాను ఫేస్ చేయక తప్పని పరిస్థితి ప్రభాస్‌ది. మనవాళ్ల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ మీడియా వాళ్లయితే చాలా ఓవర్ చేస్తారు. పెళ్లి మేటరేంటి డార్లింగ్ అని ఎవ్వరడిగినా.. ఆన్సర్ చెప్పాల్సిందే. ప్రభాస్ ఏది చెప్పినా అది మళ్లీ మరో న్యూస్ అవుతుంది. సాహోకి పబ్లిసిటీ మాట పక్కన పెడితే.. ప్రభాస్‌ని మాత్రం పెళ్లి మాటర్ ఇబ్బంది పెడుతోంది.