బ్రిటన్ ప్రధాని ప్రియురాలి ఎంట్రీ !.. అప్పుడే ‘ పొలిటికల్ వేడి ‘ !

| Edited By: Srinu

Jul 25, 2019 | 7:20 PM

బ్రిటన్ కొత్త ప్రధానిగా 55 ఏళ్ళ బోరిస్ జాన్సన్ పదవి చేపట్టగానే.. ఆయన పర్సనల్ లైఫ్ కూడా మెల్లగా బయటికొచ్చి అప్పుడే రచ్ఛ చేయడం ప్రారంభించింది. భార్య, నలుగురు సంతానాన్ని వదిలించుకుని బోరిస్ మరో యువతిని గర్ల్ ఫ్రెండ్ గా చేసుకున్నాడు. ఆ యువతి పేరే క్యారీ సైమండ్స్.. వయస్సు 31 సంవత్సరాలు. బోరిస్ కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించిన కమ్యూనికేషన్ల మాజీ హెడ్ గా ఆమె వ్యవహరిస్తూ వచ్చింది. బోరిస్ తన అధికార నివాసమైన 10 డౌనింగ్ […]

బ్రిటన్ ప్రధాని ప్రియురాలి ఎంట్రీ !.. అప్పుడే  పొలిటికల్ వేడి  !
Follow us on

బ్రిటన్ కొత్త ప్రధానిగా 55 ఏళ్ళ బోరిస్ జాన్సన్ పదవి చేపట్టగానే.. ఆయన పర్సనల్ లైఫ్ కూడా మెల్లగా బయటికొచ్చి అప్పుడే రచ్ఛ చేయడం ప్రారంభించింది. భార్య, నలుగురు సంతానాన్ని వదిలించుకుని బోరిస్ మరో యువతిని గర్ల్ ఫ్రెండ్ గా చేసుకున్నాడు. ఆ యువతి పేరే క్యారీ సైమండ్స్.. వయస్సు 31 సంవత్సరాలు. బోరిస్ కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించిన కమ్యూనికేషన్ల మాజీ హెడ్ గా ఆమె వ్యవహరిస్తూ వచ్చింది. బోరిస్ తన అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బ్లాక్ డోర్ వద్దకు చేరుకోగా.. ఈమె ఆయన స్టాఫ్ కు దగ్గరగా నిలబడి కనిపించింది. సాధారణంగా బ్రిటన్లో నూతన ప్రధాని తన అధికార నివాసానికి చేరుకున్నప్పుడు.. అతని భార్య, లేదా మహిళ అయితే ఆమె భర్త… వెంట ఉంటారు. ఈ పోకడ దాదాపు యాభై ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ మొదటిసారిగా ఈ ట్రెడిషన్ స్థానే.. కొత్త ‘ ఒరవడి ‘ కి బోరిస్ నాంది పలికినట్టుంది. ఫస్ట్ టైం ఈయన ఒక్కరే డౌనింగ్ స్ట్రీట్ బ్లాక్ డోర్ వద్ద కనిపించారు.. బోరిస్, ఆయన భార్య మెరీనా వీలర్ (ఈ దంపతులకు నలుగురు సంతానం) గత సెప్టెంబరులో తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. 25 ఏళ్ళ తరువాత మేం డైవోర్స్ తీసుకుంటాం అని వాళ్ళు వెల్లడించారు.

నిజానికి ఇంగ్లండ్, వేల్స్ వంటి నగరాల్లో ప్రతి ఏడాదీ ప్రతి 100 పెళ్ళిళ్ళకూ 64 డైవోర్స్ కేసులుంటాయట. ఏమైనా ఈ నేపథ్యంలో బోరిస్ వ్యవహారం వివాదాస్పదంగానే కనిపిస్తోంది. లండన్ లోని రాయల్ హాలోవీ యూనివర్సిటీ అధ్యాపకులు ఇదే మాట అంటున్నారు. బోరిస్ కలర్ ఫుల్ పర్సనల్ లైఫ్ ట్రెడిషనల్ ‘ ఫోటోకాల్ ‘ ని కాస్త ‘ ప్రాబ్లమాటిక్ ‘ గా మార్చవచ్చునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్యారీ సైమండ్స్.. బోరిస్ పక్కన కాకుండా.. స్టాఫ్ ముందు కెమెరాలకు కనిపించడం స్లోగా ‘ వ్యవహారం ‘ ‘ ముదిరే సూచనలకు నాందిగా భావిస్తున్నారు. బోరిస్ అధికారిక నివాసంలో ఈమె కాలు పెడితే.. 173 ఏళ్లలో ఒక ప్రధాని వయస్సు కన్నా చిన్నదైన అత్యంత పిన్న వయస్కురాలు అవుతుంది. గతంలో బోరిస్ ప్రచారం సందర్భంగా ఆయనకు, క్యారీకి మధ్య సాగిన రిలేషన్ షిప్ హెడ్ లైన్లకు చేరింది. సౌత్ లండన్లోని వీరి నివాసంలో వీరి మధ్య ఓ రాత్రి పెద్ద గొడవే జరిగిందట. ఇరుగుపొరుగువారు వీరి అరుపులు, కేకలు విన్నారట. అయితే కొన్ని రోజుల తరువాత వీళ్ళిద్దరూ హ్యాపీగానే కనబడి కెమెరాలకు పోజిచ్చారు . దీంతో బోరిస్ వివాహేతర సంబంధాలను హైలైట్ చేసే టాబ్లాయిడ్లకు పండగే అయింది.