ధోనీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేే బెటర్ : కపిల్

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుంటున్న ఆయన‌ తాజాగా మీడియాతో మాట్లాడారు.

ధోనీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేే బెటర్ : కపిల్

Updated on: Nov 02, 2020 | 10:09 PM

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుంటున్న ఆయన‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా భారత మాజీ కెప్టెన్ ధోనికి కీలక సూచనలు చేశారు.  ఎలాంటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా ఐపీఎల్‌లో రాణించడం ఎంఎస్‌ ధోనీకి కష్టమేనని చెప్పారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ ఆడితేనే అతడి దేహం మాట వింటుందని చెప్పుకొచ్చారు. కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడాలని ధోనీ నిర్ణయించుకుంటే అతడు రాణించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. వయసు గురించి తాను మాట్లాడనని..కాకపోతే ప్రస్తుతం ధోని ఎంత ఎక్కువగా ఆడితే అంతగా తన శరీరం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏడాదిలో పది నెలలు క్రికెట్‌ ఆడకుండా హఠాత్తుగా రెండు నెలలు ఐపీఎల్‌ ఆడటం కష్టతరమైన టాస్క్ అని చెప్పారు.అందుకే ధోనీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ వైపు తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ధోనిపై ప్రదర్శనపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read :

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్ ‌బై !

దారుణం..జన్మనిచ్చిన అమ్మనే సజీవ దహనం చేసిన కొడుకు