క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్ ‌బై !

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్,‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌  ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(39) ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్ ‌బై !
Follow us

|

Updated on: Nov 02, 2020 | 6:10 PM

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్,‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌  ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(39) ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై నెగ్గిన అనంతరం అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తోటి ప్లేయర్స్‌తో మాట్లాడుతూ..అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు.

చివరి మ్యాచ్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రికెట్‌కు రిటెర్మెంట్  ప్రకటిస్తోన్న విషయాన్ని చెబుతూనే వాట్సన్ ఎమోషనల్ అయ్యాడట. ఫ్రాంఛైజీ తరఫున ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని వాట్సన్‌ చెప్పినట్లు సమాచారం అందుతోంది. కాగా‌ వాట్సన్‌ 2016లోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.  2018 ఐపీఎల్‌లో చెన్నై‌ టైటిల్‌ నెగ్గడంలో వాట్సన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీతో రాణించడంతో చెన్నై మూడోసారి ట్రోఫీ గెలిచింది. ఈ సీజన్‌లో వాట్సన్‌ 11 మ్యాచ్‌లు ఆడి 299  రన్స్ చేశాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.  మొత్తం 145 ఐపీఎల్‌ మ్యాచ్‌లను వాట్సన్‌ ఆడాడు. అందులో చెన్నై తరఫున ఆడినవి 43. వాట్సన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 3,874 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలున్నాయి. పలు సార్లు బంతితో కూడా మెరిసిన వాట్సన్‌ 92 ఐపీఎల్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది తమ దేశంలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Also Read :

సౌండ్ పెంచితే సీజ్!

బాలయ్య సినిమాలో తారకరత్న !