AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

India vs West Indies T20I: వెస్టిండీస్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా, అర్షదీప్ సింగ్ పేస్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశం ఉండగా, కుల్దీప్ యాదవ్, ప్రిన్స్/మయాంక్ యాదవ్, అలాగే సంజూ శాంసన్ లేదా వైభవ్ సూర్యవంశీలకు అవకాశాలు దక్కనున్నాయి. లక్నోలో సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?
Ind Vs Wi 1st T20i
Venkata Chari
|

Updated on: Oct 05, 2026 | 3:12 PM

Share

India vs West Indies T20I: వన్డే సిరీస్ ముగిసింది. ఇక వెస్టిండీస్ జట్టుతో రేపటి నుంచి పొట్టి ఫార్మాట్‌లో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లక్నోలో మొదలుకానుంది. ఈక్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. జస్ర్పీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేస్ దళానికి నాయకుడిలా మారనున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్‌ టీంలో అర్షదీప్ చోటు దక్కించుకున్నా.. అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ ప్లేస్ పక్కా అని తెలుస్తోంది. అర్షదీప్‌తోపాటు ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్‌లలో ఒకరికి ఛాన్స్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, మరో ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి మాత్రం ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే, ఏషియన్స్ గేమ్స్ ఫైనల్లో పాక్ జట్టుపై ఈ స్పిన్నర్ 3 ఓవర్లు వేసి ఏకంగా 44 పరుగులు సమర్పించుకుని, వికెట్ పడగొట్టలేకపోయాడు. రవి బిష్ణోయ్‌పై వేటు పడేలా కనిపిస్తోంది. అలాగే, కుల్దీప్ యాదవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్న తరుణంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఈ చైనామన్ బౌలర్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఓపెనర్స్‌ ప్లేస్‌కు తీవ్రమైన పోటీ ఏర్పడింది. సంజూ శాంసన్ లేదా వైభవ్ సూర్యవంశీలలో ఎవరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారనేది చూడాలి. ఏషియన్ గేమ్స్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్‌నే ఓపెనర్‌గా పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, గంభీర్ మాత్రం సంజూ శాంసన్ వైపు ఉంటాడని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ..
ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ..
IND vs WI: ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?
IND vs WI: ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?
ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!
ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!
రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?
రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!