మాజీ ప్రధాని విమర్శలను ప్రభుత్వం ఏ దృక్కోణంలో చూడాలి?
మన్మోహన్ సింగ్..దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి వివాదరహితుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. యాక్సిడెంటల్ పీఎంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా..ఆయన స్థాయివేరు, స్థానం వేరు. ఎందుకంటే ఆయనకు ఆర్థికవేత్తగా అపార అనుభవం ఉంది. మాటలు తక్కువ మాట్లాడినా సైలెంట్‌గా పనిచేసుకుపోవడం ఆయన నైజం. ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కువ యాక్టీవ్‌గా లేరు. ముఖ్యమైనవి మినహా..కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొనడం లేదు. కానీ ఆయన హఠాత్తుగా […]

మన్మోహన్ సింగ్..దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి వివాదరహితుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. యాక్సిడెంటల్ పీఎంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా..ఆయన స్థాయివేరు, స్థానం వేరు. ఎందుకంటే ఆయనకు ఆర్థికవేత్తగా అపార అనుభవం ఉంది. మాటలు తక్కువ మాట్లాడినా సైలెంట్‌గా పనిచేసుకుపోవడం ఆయన నైజం. ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కువ యాక్టీవ్‌గా లేరు. ముఖ్యమైనవి మినహా..కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొనడం లేదు. కానీ ఆయన హఠాత్తుగా మౌనం వీడారు. దేశ ఆర్థికవ్యవస్థ తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వానకి సూచనలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని – ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించే పని చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు చేరడానికి మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విరుచుకుపడ్డారు. సాధారణ జీడీపీ వృద్ధిరేటు 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని..నిరుద్యోగం పెరిగిపోయిందని, మోదీ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను అన్ని రకాలుగా భ్రష్టుపట్టించటమే దీనికి కారణమని మన్మోహన్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీనే ఆయనతో మాట్లాడించింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే భారత జీడీపీ ఏ రేంజ్‌లో తగ్గిందో అందరికి విధితమైన విషయమే. ఆర్ధికరంగంలో సంస్కరణల దిశగా బీజేపీ ప్రభుత్వం లేటుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బ్యాంకుల విలీనం, ఎఫ్‌డీఐ విషయంలో సర్దబాట్లతో తిరిగి భారత ఎకనమీని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఏది ఏమైనా దేశ అభ్యన్నతికి మాజీ ప్రధానిగా, ఆర్ధిక వేత్తగా ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలను విలువైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మాటలను జస్ట్ పొలిటికల్ విమర్శలుగా భావించడం మాత్రం కొంత ఇబ్బందికర విషయమే.