దీదీ సర్కార్ అనూహ్య నిర్ణయం…

|

Aug 13, 2020 | 12:23 PM

మమతా బెనర్జీ ప్రభుత్వం పాలన వ్యవహారంలో మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. బెంగాల్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు...

దీదీ సర్కార్ అనూహ్య నిర్ణయం...
Follow us on

మమతా బెనర్జీ ప్రభుత్వం పాలన వ్యవహారంలో మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. బెంగాల్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సహా 20 మంది పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసింది. బదిలీ చేస్తు ఉత్తర్వులను జారీ చేసింది. కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ 2వ బెటాలియన్ డీసీపీ ద్యుతిమాన్ భట్టాచార్యను హౌరా పోలీస్ కమిషనరేట్ డీసీపీ (హెడ్ క్వార్టర్స్)గా బదిలీ చేసింది.

ఈ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రియాబ్రతా రాయ్‌ని కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ బాధ్యతలు అప్పగించింది. బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ కొత్త డీసీపీ (హెడ్ క్వార్టర్స్)గా సూర్యప్రతాప్ సింగ్‌ను నియమించింది. అలీపూర్దౌర్ ఏఎస్పీగా ఉన్న ఉమేశ్ ఘన్‌పథ్‌కు బుద్ధ నగర్ డీసీపీగా బాధ్యతలు అప్పగించింది.

కాగా బదీలీ అయిన అధికారుల్లో డీసీపీ, ఏఎస్పీ, ఎస్‌డీపీవో ర్యాంకుల అధికారులే ఎక్కువగా ఉన్నారు. అయితే కరోనా ఆంక్షలు అములు జరుగుతున్న సమయంలో బాద్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఒక్కసారిగా బదిలీ చేయడం.. పెద్ద చర్చగా మారింది. ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేడం బెంగాల్ లో ఇదే తొలసారి అని అంతా అనుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా ఉంటాయేమోనని అంచనా వేస్తున్నారు.