చర్చలు సఫలం… సమ్మె విరమణ

| Edited By:

Jun 17, 2019 | 7:34 PM

బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్యుల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. కోల్‌కతాలోని విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ల మీద పేషెంట్ బంధువులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. అది దేశవ్యాప్తంగా పాకింది. దీంతో భారత వైద్య సంఘం ఒక రోజు సమ్మెకు కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైద్యుల బృందంతో మమతా బెనర్జీ చర్చలు జరిపారు. మొత్తం 31 మంది ప్రతినిధులు మమతా బెనర్జీతో చర్చలకు […]

చర్చలు సఫలం... సమ్మె విరమణ
Follow us on

బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్యుల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. కోల్‌కతాలోని విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ల మీద పేషెంట్ బంధువులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. అది దేశవ్యాప్తంగా పాకింది. దీంతో భారత వైద్య సంఘం ఒక రోజు సమ్మెకు కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైద్యుల బృందంతో మమతా బెనర్జీ చర్చలు జరిపారు. మొత్తం 31 మంది ప్రతినిధులు మమతా బెనర్జీతో చర్చలకు హాజరయ్యారు. బెంగాల్‌కు చెందిన ఒక మీడియా చానల్‌ సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వైద్యులు ప్రధానంగా 12 డిమాండ్లు పెట్టినట్టు తెలస్తోంది. వాటిని మమతా బెనర్జీ అంగీకరించారు. సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది.