National Youth Day: నేడు జాతీయ యువజన దినోత్సవం.. ఈ సందర్భంగా హింసను అంతం చేయడానికి .. పోరాటం చేసేందుకు సమర్ధత గల యువకులు కావాలి అని ఆయుష్మాన్ ఖుర్రానా అన్నారు. ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రముఖమని దేశ భవిష్యత్ యువత ఆలోచనలు నడవడికతో ముడిపడి ఉందని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
ఇదే అంశంపై యునిసెఫ్ ప్రముఖ న్యాయవాది ఆయుష్మాన్ ఖుర్రానా స్పందిస్తూ.. పిల్లలపై జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో యువత పాత్ర ఎంతో ప్రముఖమని చెప్పారు. అందుకని యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. యువతే నవసమాజ నిర్మాతలని… అవినీతి అన్యాయాలపై పోరాటడానికి కలిసి వస్తే అసాధారణ ఫలితాలు పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులను అరికట్టగల శక్తి యువతకు ఉంది.. మీరు తీసుకునే చిన్న చిన్న చర్యలే భావి పౌరుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు ఆయుష్మాన్.
Also Read: విరుష్క జంటకు శుభాకాంక్షలు చెప్పిన రోహిత్ శర్మ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలంటూ దీవెన