AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అర్ధరాత్రి ఐఐటీ క్యాంపస్‌లో చిరుత హల్‌చల్.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!

ముంబైలోని పోవై ప్రాంతంలో ఉన్న ఐఐటీ-బాంబే క్యాంపస్‌లో శుక్రవారం (జూన్ 19) తెల్లవారుజామున చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. క్యాంపస్‌లోని సిబ్బంది హాస్టల్ సమీపంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులి వీధి కుక్కపై దాడి చేసింది. దానిని పొదల్లోకి లాక్కెళ్లిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Watch Video: అర్ధరాత్రి ఐఐటీ క్యాంపస్‌లో చిరుత హల్‌చల్.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!
Leopard Enters Iit Bombay Campus
Balaraju Goud
|

Updated on: Jun 20, 2026 | 12:45 PM

Share

ముంబైలోని పోవై ప్రాంతంలో ఉన్న ఐఐటీ-బాంబే క్యాంపస్‌లో శుక్రవారం (జూన్ 19) తెల్లవారుజామున చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. క్యాంపస్‌లోని సిబ్బంది హాస్టల్ సమీపంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులి వీధి కుక్కపై దాడి చేసింది. దానిని పొదల్లోకి లాక్కెళ్లిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో చిరుత క్యాంపస్‌లోకి ప్రవేశించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో కుక్కను వెంబడించి పట్టుకున్న తర్వాత సమీపంలోని పొదల వైపు తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ ఘటనలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా మారింది. ఘటన అనంతరం క్యాంపస్ యాజమాన్యం అప్రమత్తమై భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. చిరుత కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో చాలా మంది తమ నివాసాల్లోనే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోవై ప్రాంతంలో చిరుతపులులు కనిపించడం కొత్త విషయం కాదు. ఐఐటీ-బాంబే క్యాంపస్‌కు సమీపంలోనే సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం ఉండటంతో ఆహారం కోసం రాత్రివేళల్లో చిరుతలు నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా వీధి కుక్కలు వాటికి సులభమైన వేటగా మారుతున్నాయి.

ఇటీవలి కాలంలో ముంబై, థానే, కొల్హాపూర్ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం పెరుగుతోంది. దీంతో వన్యప్రాణి-మానవ ఘర్షణలను నివారించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. చిరుతల కదలికలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. పెరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

చిరుత వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us