AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కేసు వదిలిలేద్దామనుకున్నారు.. కట్‌చేస్తే.. డాగ్‌ స్క్వాడ్ ఎంట్రీతో మారిన సీన్.. చిన్న గుడ్డ ముక్కతో..

యూపీలో సంచలనం సృష్టించిన ఒక చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఓ శునకం చేసిన పని కేసు స్వరూపాన్నే మలుపు తిప్పింది. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకపోవడంతో.. అంతా అయిపోంది అనుకునే టైంలో ఎంట్రీ ఇచ్చిన ఓ శునకం కేసును ఊహించని మలుపు తిప్పింది. పోలీసులు చూపించిన ఓ చిన్న గుడ్డ ముక్క స్మెల్ సహాయంతో ఆ శునకం ఏకంగా నిందితుడినే పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: కేసు వదిలిలేద్దామనుకున్నారు.. కట్‌చేస్తే.. డాగ్‌ స్క్వాడ్ ఎంట్రీతో మారిన సీన్.. చిన్న గుడ్డ ముక్కతో..
Up Police Dog Mary
Anand T
|

Updated on: Jun 24, 2026 | 9:36 AM

Share

ఆదో లైంగిక దాడి కేసు.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఇక చేసేదేమి లేదో కేస్ క్లోజ్ చేయాలనే స్టేజ్‌ వచ్చారు పోలీసులు.. కట్‌చేస్తే.. రంగంలోకి వచ్చిన పోలీస్ గాడ్ కేసు స్వరూపాన్నే మార్చేసింది. ఓ చిన్న గుడ్డముక్క సహాయంతో ఏకంగా నిందితుడినే పట్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాబ్రాలా పరిధిలో జూన్ 19న ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడాన్ని గమనించిన తల్లి వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

పోలీసులకు దొరకని క్లూ

అయితే, ఈ ఘటనతో తీవ్రంగా బయపడిపోయిన ఆ చిన్నారి తనపై ఎవరు, ఎలా దాడి చేశారనే విషయాన్ని పోలీసులకు స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇక తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికంగా ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని తీవ్రంగా వెతికారు. కానీ వారికి ఎలాంటి క్లూ దొరకలేదు. స్థానికులను విచారించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు కేస్‌ను క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే జిల్లా డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

సీన్‌లోకి వచ్చిన ‘మేరీ’:

అప్పుడే సీన్‌లోకి కే-9 విభాగానికి చెందిన ‘మేరీ’ అనే డాగ్ ఎంట్రీ ఇచ్చింది. పోలీసులు చూపించిన ఒక చిన్న గుడ్డ ముక్క వాసన ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడింది. స్మెల్ చూడగానే వెంటనే అలర్ట్ అయిన మేరీ, అక్కడి ముందుకు కదలడం స్టార్ట్ చేసింది. అలా ముందుకు వెళ్తూ.. ఒక ఊర్లోకి వెల్లింది. అక్కడ వీధుల గుండా వెళ్తూ నేరుగా ఒక ఇంటి ముందుకు వెళ్లి ఆగి.. అక్కడ గట్టిగా మొరగడం స్టార్ట్ చేసింది.దీంతో ఇంట్లో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నేరానికి పాల్పింది తానేనని నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మేరీపై ప్రశంసలు

దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు అధికారులు మాట్లాడుతూ.. నిందితుడిని గుర్తించడం కష్టంగా మారినప్పుడు మేరీ తమకు కొండంత అండగా నిలిచిందని.. అది చూపిన ఆధారంతోనే నిందితుడిని పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించి కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన లాబ్రడార్ ‘మేరీ’పై పోలీస్ శాఖతో పాటు స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us