రైతులు పట్టుకున్న ‘ముసుగు వ్యక్తి’ యూ-టర్న్ తీసుకున్నాడు, వారే తనను బెదిరించారంటూ వెల్లడి, కొత్త మలుపు !

నలుగురు రైతు సంఘాల నేతలపై కాల్పులు జరపడానికి, ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీని ఆటంకపరచడానికి కుట్ర పన్నిన వ్యక్తిని తాము పట్టుకున్నామంటూ..

రైతులు పట్టుకున్న ముసుగు వ్యక్తి యూ-టర్న్ తీసుకున్నాడు, వారే తనను బెదిరించారంటూ వెల్లడి, కొత్త మలుపు !

Edited By:

Updated on: Jan 23, 2021 | 9:16 PM

నలుగురు రైతు సంఘాల నేతలపై కాల్పులు జరపడానికి, ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీని ఆటంకపరచడానికి కుట్ర పన్నిన వ్యక్తిని తాము పట్టుకున్నామంటూ రైతు సంఘాల నాయకులు ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అంతవరకు ముఖానికి ముసుగు ధరించిన ఈ వ్యక్తిని వారు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అయితే కొద్దిసేపటికే ఇతడు యూ-టర్న్ తీసుకున్నాడు. ముసుగు తొలగించి..తన ముఖాన్ని చూపుతూ తనను రైతులు కొట్టారని, బెదిరించారని ఆరోపించాడు. తనతో బాటు మరో ముగ్గురిని కూడా వారు పట్టుకున్నారని, వీరిలో ఒకరిని కొట్టి చంపామని తెలిపారని వెల్లడించాడు. ఇతడిని యోగేష్ అనే యువకుడిగా గుర్తించారు. తనను పోలీసులకు అప్పగించాలని ఇతడు వారిని కోరాడట.. కాగా తన కొడుకు యోగేష్ ఈ నెల 20 న పనికి బయటకు వెళ్తున్నానంటూ తిరిగి రాలేదని, పైగా పోలీసుల నుంచి తమకు కాల్ అందిందని ఈ యువకుని తల్లి తెలిపింది. సోనేపట్ పోలీసులు ఇతడినికస్టడీ లోకి తీసుకుని చాలాసేపు ఇంటరాగేట్ చేశారు. కానీ ఇతనికి నేర చరిత్ర లేదని వారు చెప్పారు.


Read Also:రైతుల ఆందోళనపై సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విచారణ.. క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్న ధ‌ర్మాస‌నం.
Read Also:రైతుల ఆందోళనలో పురోగతి, రెండ్రోజులు మందుగానే దిగొచ్చిన కేంద్రం.. మంగళవారం చర్చలు అసంపూర్ణం.