దెయ్యాలు ఉన్నాయంటూ స్కూల్‌లో క్షుద్రపూజలు.. భయంలో విద్యార్థులు!

|

Jan 11, 2020 | 9:48 PM

వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ పూజలు జరగడంతో స్థానికంగా సంచలనమైంది. అదీ కూడా చదువు చెప్పే ప్రధానోపాధ్యాయురాలు స్కూల్లో దెయ్యాలు ఉన్నాయని మూఢ నమ్మకంతో ఈ పని చేయడం వల్ల గ్రామస్తులు నివ్వెరపోయారు. దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్మేవాళ్లకు.. అలాంటివన్నీ వట్టి భూటకాలని చెప్పాల్సింది పోయి వీళ్ళే ఆ మూఢ నమ్మకాలను విశ్వసిస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ఆలోచన రాక మానదు. ఇక అసలు విషయానికి వస్తే శంభునిపల్లి […]

దెయ్యాలు ఉన్నాయంటూ స్కూల్‌లో క్షుద్రపూజలు.. భయంలో విద్యార్థులు!
Follow us on

వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ పూజలు జరగడంతో స్థానికంగా సంచలనమైంది. అదీ కూడా చదువు చెప్పే ప్రధానోపాధ్యాయురాలు స్కూల్లో దెయ్యాలు ఉన్నాయని మూఢ నమ్మకంతో ఈ పని చేయడం వల్ల గ్రామస్తులు నివ్వెరపోయారు.

దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్మేవాళ్లకు.. అలాంటివన్నీ వట్టి భూటకాలని చెప్పాల్సింది పోయి వీళ్ళే ఆ మూఢ నమ్మకాలను విశ్వసిస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ఆలోచన రాక మానదు. ఇక అసలు విషయానికి వస్తే శంభునిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దెయ్యాలున్నాయని భయపడ్డ ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా భూత వైద్యుడిని పిలిపించి క్షుద్రపూజలు నిర్వహించింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు షాక్ అయ్యారు. సాంకేతిక యుగంలో ఉంటూ పాఠాలు బోధించాల్సిన టీచర్లే ఇలాంటి పనులు చేస్తే విద్యార్థులు ఏ మార్గంలో  వెళ్తారోనన్న ఆందోళన చెందుతున్నారు. కాగా, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.