సస్పెన్షన్ నన్ను మార్చేసింది.. టీమ్ కోసం ఆడటం నేర్చుకున్నా..
‘కాఫీ విత్ కరణ్’ అనే టీవీ షోలో సహా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి పాల్గొన్న కేఎల్ రాహుల్.. మహిళలను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ నుంచి సస్పెన్షన్ ఎదుర్కున్నాడు. ఇక ఆ ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ తాజా ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. సస్పెన్షన్ తర్వాత తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని.. ఆటకే అంకితమివ్వాలని డిసైడ్ అయినట్లు రాహుల్ పేర్కొన్నాడు. ఆ సమయంలో తనకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎంతగానో […]

‘కాఫీ విత్ కరణ్’ అనే టీవీ షోలో సహా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి పాల్గొన్న కేఎల్ రాహుల్.. మహిళలను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ నుంచి సస్పెన్షన్ ఎదుర్కున్నాడు. ఇక ఆ ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ తాజా ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. సస్పెన్షన్ తర్వాత తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని.. ఆటకే అంకితమివ్వాలని డిసైడ్ అయినట్లు రాహుల్ పేర్కొన్నాడు. ఆ సమయంలో తనకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎంతగానో సపోర్ట్ చేశాడని రాహుల్ తెలిపాడు.
ఇటీవల తన కన్సిస్టెంట్ పెర్ఫార్మన్స్‌లకు కూడా కారణం అదేనని రాహుల్ వివరించాడు. వాస్తవానికి సస్పెన్షన్‌కు ముందు స్వార్ధంగా ఉండేవాడిని.. వ్యక్తిగత లాభం కోసమే ఆడేవాడినని అతడు చెప్పుకొచ్చాడు. అందుకే వరుసగా విఫలమవుతూ వచ్చానన్నాడు. అయితే ఆ తర్వాతే టీమ్ కోసం ఆడటం నేర్చుకున్నా. అసలు క్రికెటర్ల కెరీర్ చాలా చిన్నదని సస్పెన్షన్ తర్వాతే అర్ధమైంది. జాగ్రత్తగా ఉంటేనే ఓ 12 ఏళ్ల కెరీర్ ఉంటుందని అప్పటి నుంచి ఆటకు అంకితం అయ్యాను. అందుకే సక్సెస్ ఫుల్ ప్లేయర్‌గా ఎదిగాను. ఇలా మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఒత్తిడి కూడా దూరమైంది. టీం కోసం ఏదైనా చేయాలని, ఓ ఛాంపియన్ టీంలో మెంబర్‌గా ఉండాలని.. నా ఆటను మార్చుకుని కష్టపడ్డానని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.




