Hawala Money : సాగర తీరంలో హవాలా అలలు.. ఇల్లీగల్ బిజినెస్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఫోకస్

|

Jan 10, 2021 | 8:25 PM

విశాఖ సాగర తీరంలో హవాల కట్టలు బుసలు కొడుతున్నాయి. సైలెంట్‌గా చాపకింద నీరులా సాగుతున్న ఇల్లీగల్ దందాకు ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్..

Hawala Money : సాగర తీరంలో హవాలా అలలు.. ఇల్లీగల్ బిజినెస్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఫోకస్
Follow us on

Hawala Money : విశాఖ సాగర తీరంలో హవాల కట్టలు బుసలు కొడుతున్నాయి. సైలెంట్‌గా చాపకింద నీరులా సాగుతున్న ఇల్లీగల్ దందాకు ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టేందుకు నిఘా పెట్టారు. త్రీటౌన్ పోలీసులతో కలిసి కాపుకాసి నోట్ల కట్టలను పట్టుకున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ దగ్గర.. కారును ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో 70 లక్షల రూపాయల నగదు దొరికిపోయింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడకు తీసుకెళ్తున్నారు? ఆటోనగర్‌కు-ఆశీలుమెట్టకూ ఉన్న లింకేంటి? అనే అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

కారుతోపాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో అసలు నిజాలను ఒప్పుకున్నారు నిందితులు. చరిత్రకుమార్ అనే వ్యక్తి నుంచి తాము 70 లక్షలను తీసుకున్నామని అంగీకరించారు. ఈ డబ్బులను ప్రవీణ్ కుమార్ జైన్‌కు కోడింగ్ ప్రకారం నగదు అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిపారు. కేవలం 3 శాతం కమిషన్ పై నిందితులు హవాలా బ్రోకరింగ్ చేస్తున్నారని ఈస్ట్ ఏసీపీ హర్షిత తెలిపారు. 2 బ్యాగుల్లో 70 లక్షల నగదు, కారుతో పాటు మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. బ్లాక్‌ కలర్‌ కారులో హవాల మనీ తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ అందిందని అన్నారు. మాటు వేసి ఖాకీలు 70 లక్షలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా వెల్లడించారు.