AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuma Mounika: ఇకపై ఆ బాధ్యత నేను తీసుకుంటా.. వారందరి పేర్లను అప్పుడు బయటపెడతా.. సంచలన వ్యాఖ్యలు చేసిన భూమా మౌనిక..

Bhuma Mounika: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి, భూమా అఖిల ప్రియ అరెస్ట్‌పై ఆమె చెల్లి భూమా మౌనిక మరోసారి తీవ్రంగా స్పందించారు.

Bhuma Mounika: ఇకపై ఆ బాధ్యత నేను తీసుకుంటా.. వారందరి పేర్లను అప్పుడు బయటపెడతా.. సంచలన వ్యాఖ్యలు చేసిన భూమా మౌనిక..
Shiva Prajapati
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 10, 2021 | 8:52 PM

Share

Bhuma Mounika: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి, భూమా అఖిల ప్రియ అరెస్ట్‌పై ఆమె చెల్లి భూమా మౌనిక మరోసారి తీవ్రంగా స్పందించారు. అఖిల ప్రియ అరెస్ట్‌లో పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఆమె అరెస్ట్ వెనకాల రాజకీయ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఆదివారం నాడు కర్నూలులోని ఆళ్లగడ్డలో భూమా మౌనిక రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అఖిల ప్రియకు సోమవారం నాడు బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడపిల్ల మీద రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్కడ అఖిలకు బెయిల్ వచ్చాక అందరి పేర్లను బయట పెడతానంటూ మౌనిక కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల గురించి త్వరలోనే గవర్నర్, కేంద్ర సహాయ హోంమంత్రి కిషన్ రెడ్డి, డీజీపీని కలుస్తానని చెప్పారు.

భూమా కుటుంబం నుంచి తాను ఆళ్లగడ్డ బాధ్యత తీసుకుంటానని మౌనిక ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్ల నుంచి ఆళ్లగడ్డకు రాలేకపోయానని అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తనకు ఫోన్ చేస్తే తాను అండగా ఉంటానని కార్యకర్తకు భూమా మౌనిక భరోసా ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కేసులు, రాజకీయ ఒత్తిడిలు భూమా కుటుంబానికి కొత్తేం కాదని పేర్కొన్నారు. అఖిల ప్రియకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొద్దామని కార్యకర్తలకు మౌనిక దిశానిర్దేశం చేశారు.

Also read:

Minister Chases Bus: విద్యాశాఖ మంత్రా మజాకా.. విద్యార్థులకు బస్సు ఆపలేదని ఏకంగా..

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే..!