విశాఖ గాజువాకలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. పక్కా సమాచారంతో ఈ వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు.. పలువురు యువతులను, విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుంచల కృష్ణ, శ్రీనివాసరావు, కె.హరి సన్యాసిరావు, కమల అనే వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పాడి వ్యభిచార దందా షురూ చేశారు. విశాఖ శివారు ప్రాంతంలోని గాజువాక అందుకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. అక్కడి ఎస్ఎఫ్ఎస్ పాఠశాలకు దగ్గర్లో ఓ ఇంటికి అద్దెకు తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు.
శనివారం సాయంత్రం పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో, ఈ చీకటి వ్యాపారం వెలుగులోకిి వచ్చింది. ఈ సందర్భంగా ముగ్గురు యువతులు, ఒక విటుడు, ఇద్దరు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read :