Non Veg Sales Ban: మాంసం ప్రియులకు ఊహించని షాక్.. ఆదివారం మాంసం దుకాణాలు బంద్.. కారణం అదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మాస్కులు వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడంలేదు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Non Veg Sales Ban: మాంసం ప్రియులకు ఊహించని షాక్.. ఆదివారం మాంసం దుకాణాలు బంద్.. కారణం అదేనా..?
Vizag Non Veg Sales Banned

Edited By: Team Veegam

Updated on: May 29, 2021 | 3:12 PM

Vizag Non Veg Sales Bans: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 20 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. సామాజిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడంలేదు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ఆదివారం వస్తే మాంసం, చేపల దుకాణాలు ముందు బారులుదీరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రేటర్ విశాఖ‌పట్నం పరిధిలో ఆదివారం రోజు నాన్ వెజ్ మార్కెట్లపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు జీవీఎంసీ తెలిపింది. వరుసగా రెండో వారం మాంసం అమ్మకాలపై ఆంక్షలు అమలు చేస్తున్నట్టు ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాదు నగరంలో కర్ఫ్యూ, 144సెక్షన్ అమలులో ఉన్న దృష్ట్యా జనం ఎవరు గుమికూడ వద్దని తెలిపింది. ఈ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని జీవీఎంసీ పేర్కొంది.

కరోనా కట్టడికి జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశాల మేరకు అక్కిరెడ్డిపాలెం ప్రాంతంతో పాటు ఆదివారం పలు మాంసం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. రామ్‌నగర్‌, అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, బీహెచ్‌పీవీ ప్రధాన రహదారుల్లో వున్న మాంసం దుకాణాలు, షీలానగర్‌, తుంగ్లాం, మింది వంటి కాలనీల్లో ఎక్కువగా మాంసం విక్రయాలు సాగుతుంటాయి. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా మాంసం దుకాణాలపై నిషేధం అమలు కానున్నట్లు జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు.