తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాత్రి సమయాల్లో వణికిపోతున్న మన్యం ప్రాంతాలు

|

Nov 21, 2020 | 11:27 PM

ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని వెల్లడించారు. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని...

తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాత్రి సమయాల్లో వణికిపోతున్న మన్యం ప్రాంతాలు
Follow us on

Cold Winds : తెలుగు రాష్ట్రాలను చల్లని గాలులు చుట్టేస్తున్నాయి. రాత్రి సమయంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం వణికిపోతున్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో చలి గాలులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. దీనికి తోడు ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని వెల్లడించారు.
మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

శనివారం పాడేరులో 12.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 16.5, చింతపల్లిలో 17.5, అరకులో 16.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మూడు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఎక్కువ ప్రాంతాలు పొడిగా ఉంటాయని తెలిపారు.